కొత్త ఆలోచనల ఆవిష్కారం

మీ ఆలోచనలు మీ కన్నా గొప్పవి అంటారు ఓ రచయిత..అది చాలా ఆశ్చర్యపరిచే ఆలోచన. ఆలోచనల వెనక ఉండే రహస్యాల్లోకి లోతుగా వెళ్లి పరిశీలించిన కొద్ది..మనకు అది నిజమే అని స్పష్టమవుతూంటుంది. ఒక్కో వ్యక్తి గురించి, వాళ్ల నేపధ్యం గురించి తెలుసుకుంటూంటే ఓ వ్యవస్దని అర్దం చేసుకునే వీలుటుంది. జీవితం అంటే కేవలం బ్యాంక్ అక్కౌంట్లు మాత్రమే కాదనే సత్యం బోధపడుతుంది. జీవితంలో ఎదిగే దశలో ఇంకా స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడకముందు అన్ని రకాల పుస్తకాలూ చదువుతాం. ఏర్పడ్డాక మనకి ఇష్టమైనవి ఏవో మనం తెలుసుకుని అవే చదువుకుంటాం. అలాంటి స్దితిలో చదావాల్సిన పుస్తకం..Tell me a story. ‘అవుట్‌ ఆఫ్‌ బాక్స్‌ థింకింగ్‌’ మాదిరిగా ఒక విషయంపై కొత్తగా ఎలా ఆలోచించవచ్చో వీటిని చదివి తెలుసుకోవచ్చు. మన ప్రాంతంలోని ప్రజలు, పరిస్థితులును ప్రతిబింబిస్తూ రాసిన కథలు మన ఆధునిక జీవిత బతుకుచిత్రాన్ని కళ్లకు కడుతుంది. మనలోని చైతన్యపు అగ్గిరవ్వల్ని పరిచయం చేస్తుంది. ఈ పుస్తకం రాసింది రవీందర్ సింగ్.ఇంఫోసిస్ లో కొంత కాలం పని చేసి దానికి రిజైన్ చేసి పూర్తి స్దాయి రచయిత గాఅవతరించాడు.ఇప్పటిదాకా ఎనిమిది నవలలు రాశాడు.I too had a love story,Your dreams are mine వంటివి పేరు తెచ్చుకున్నాయి. అతి తక్కువ వయస్సు, సమయంలోనే ఈ రచయిత దేశం లోని ప్రముఖ రైటర్స్ ల్లో ఒకరి గా రూపొందాడు.అతని సక్సెస్ కు కారణం ట్రావలింగ్ ..జనాలని కలుసుకోవటం..సంవత్సరం మొత్తం మీద మెట్రో లు,నాన్ మెట్రోలు ఇలా అదీ ఇదీ అనకుండా దేశం లోని వివిధ నగరాలు,పట్టణాలు తిరుగుతూ తన పాఠకుల్ని కలుసుకుంటూ ఉంటాడు.అందుకే ఆయన రచనలు భూమి మీద ఉంటాయి. తన రచనా వ్యాసంగంతో పాటు ..ప్రస్తుతం బ్లాక్ ఇంక్ అనే సంస్థ స్థాపించి రచనా రంగంలో అనేక ప్రయోగాలు చేస్తున్నాడు.అనేకమంది యువ రచయితల్ని పరిచయం చేసే పోగ్రాం పెట్టుకున్నాడు. మిమ్మల్ని బాగా కదిలించిన ఏదైనా సంఘటన ఆధారంగా కధ రాసి పంపమని కొత్త వాళ్ళకి పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపుకి స్పందించి యువ రచయతలు నుంచి కొన్ని వందల కధలు దేశ వ్యాప్తం గా రాగా,వాటిని రకరకాలుగా వడపోసి 21 కధల్ని ఎంపిక చేసాడు. ఆ తర్వాత పెంగ్విన్ వారి సాయంతో ఓ సంకలనం గా వేశారు. ఆ సంకలనమే Tell me a story .ఈ పుస్తకం ప్రత్యేకత.. రోజువారి జీవితం లోనుంచి అనేక కోణాల్ని చూపించే కధలు ఉండటమే వేయిపూలు వికసించనీ… వేయి ఆలోచనలు సంఘర్షించనీ అన్నట్టు దేశం గురించీ, సమాజం గురించీ ఆలోచించేవారందరూ చదవాల్సిన పుస్తకమిది.